వేగంగా దర్యాప్తు: ప్రధాని ఢిల్లీ, కాన్పూర్, ఇండోర్ నగరాలలో జనం ఎక్కువగా సందర్శించే ప్రదేశాలపై టెర్రరిస్టుల కన్ను పడిందని వేగుల నుంచి సమాచారం రావడంతో హోమ్ మంత్రిత్వశాఖ ఈ మూడు నగరాలను అప్రమత్తం చేసింది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు ఇండోర్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నది. 'టెర్రరిస్టులు ఢిల్లీ, కాన్పూర్, ఇండోర్ లను లక్ష్యం చేసుకోవచ్చునని మాకు వేగుల నుంచి సమాచారం అందింది. మేము ఈ సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలకు తెలియజేసి, సముచిత చర్యలు తీసుకోవలసిందిగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించాం' అని హోమ్ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు.
జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, కీలక కార్యాలయాలు, విమానాశ్రయాలు, ఇతర ప్రదేశాలలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయవలసిందని కోరుతూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే ఒక అడ్వైజరీని పంపింది ఇది ఇలా ఉండగా, పుణెలోని జర్మన్ బేకరీని తుత్తునియలు చేసిన పేలుడులో ఆర్ డిఎక్స్ ను, అమోనియం నైట్రేట్ ను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
హోమ్ మంత్రిత్వశాఖలో జరిగిన ఉన్నత స్థాయి భద్రత సమీక్ష సమావేశానికి జాతీయ భద్రతా విషయాల సలహాదారు (ఎన్ఎస్ఎ) శివశంకర్ మీనన్, హోమ్ శాఖ కార్యదర్శి జి.కె. పిళ్ళై, 'రా' అధిపతి కె.సి. వర్మ, ఐబి డైరెక్టర్ రాజీవ్ మాథుర్, మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Pages: -1- 2 News Posted: 15 February, 2010
|