మమతను ఏడిపించిన ప్రణబ్ ఈ 24 ప్రాజెక్టులలో కనీసం పది పశ్చిమ బెంగాల్ కు సంబంధించినవి. వీటిలో నాలుగు కోలకతా మెట్రో రైల్వే ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్టులు. నిధుల కొరత ఉన్న స్థితిలో ఈ ప్రాజెక్టులను రైల్వే శాఖ అమలు పరుస్తుందా అని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ప్రశ్నించారు. 19 మంది ఎంపిలు ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) రెండవ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద మిత్ర పక్షం.
మంత్రిగా ఎవరినీ లెక్కచేయని రీతిలో వ్యవహరిస్తున్నందుకు మమతా బెనర్జీపై ప్రణబ్ ముఖర్జీ విరుచుకుపడినప్పుడు ఈ సమావేశంలో ఉద్రిక్తత, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 'మీరు పాపులిస్ట్ గా ఉండాలని, ఎంతో చేస్తున్నట్లు అందరికీ సూచించాలని మీరు అనుకుంటుండవచ్చు. మీ దృష్టి పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలపై ఉందని, తమ శ్రేయస్సునే కాంక్షిస్తున్నానని రాష్ట్రంలో మీ అభిమానులతో మీరు చెప్పాలని అనుకుంటున్నారని నాకు తెలుసు. కాని ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పని చేస్తుంటుందని, ఇలా కాదని గుర్తుంచుకోండి' అని ప్రణబ్ వ్యాఖ్యానించారు.
కోలకతా మెట్రో రైలు మార్గంలో నాలుగు విస్తరణ పనులు చేపట్టడంతో పాటు ఉత్తర బెంగాల్ లోని దినాజ్ పూర్, హిలి ప్రాంతాలలో కొత్త కనెక్షన్లను ప్రతిపాదించారు. రాష్ట్రంలో దక్షిణ భాగంలో తృణమూల్ కాంగ్రెస్ కు బలం ఉన్నట్లుగానే ఉత్తర బెంగాల్ కు కాంగ్రెస్ కు కోట వంటిది. ఆమె బీహార్ లోని మాధేపురాలో రైలు ఇంజన్ల ఫ్యాక్టరీకి అదనపు నిధులు కూడా కోరారు.
రైల్వే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన ఆర్థిక మంత్రితో సంప్రదించవలసిందిగా రైల్వే మంత్రిని ప్రధాని కోరారు. ముఖర్జీతో గురువారం సాయంత్రం బడ్జెట్ పై సంప్రదింపుల కోసం ఆమె రాలేదు. కాని ఈ చర్చల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వాగ్వాదానికి నాంది అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పడింది. ఎరువుల సబ్సిడీకి సంబంధించిన కొత్త విధానంపై ఎంకె అళగిరి, శరద్ పవార్ వంటి మంత్రులతో పాటు మమతా బెనర్జీ ఆ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. 'మీరు పాపులిస్ట్ కావాలని ఆకాంక్షిస్తుంటారు. అదే సమయంలో సంస్కరణవాదిగా కూడా ఉండాలని అనుకుంటుంటారు. మీరు రైల్వే చార్జీలను పెంచడానికి సిద్ధపడడం లేదు. కాని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంటారు. అయితే, ఎరువుల ధరలలో ప్రధాన సంస్కరణను తీసుకురావాలని మేము అనుకున్నప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు' అని ముఖర్జీ రాష్ట్రానికి చెందిన తన జూనియర్ సహచరురాలితో అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 20 February, 2010
|