మమతను ఏడిపించిన ప్రణబ్ ఆ సమయంలో ఆక్షేపణ వ్యక్తం చేసేందుకు మమతకు అవకాశం లభించలేదని, కాని తన రైల్వే బడ్జెట్ ద్వారా అభివృద్ధిని సాధించడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఆమె స్పష్టం చేశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. రైలు ప్రమాదాల సమస్యను పరిష్కరించడానికి తాను సంకల్పించిన ప్రత్యేక భద్రతా నిధికి దాదాపు రూ. 22 వేల కోట్లను సమకూర్చాలని మమత కోరారు. ముఖర్జీ ఈ కోర్కెకు పాక్షికంగా అంగీకారం తెలిపారు.
రెండు మిత్ర పక్షాల మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ఇటీవలి ప్రకటనలతోనే సుస్పష్టమైంది. రైల్వే మంత్రిత్వశాఖను నిర్వహించడంలో ఆమె సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఉన్నత స్థాయి నాయకులు ప్రశ్నించారు. 'ఎవరైనా 50 లేదా 60 కొత్త రైళ్లను ప్రకటించవచ్చు. మరి రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి సంగతేమిటి? గత కొన్ని నెలల్లో పలు ప్రమాదాలు సంభవించాయి. కొత్త రైళ్లను ప్రకటించడం, స్టేషన్లకు ఆకుపచ్చ రంగు వేయించడం వంటి ప్రాజెక్టులపై కన్నా ఈ విషయాలపై ఆమె ముందు దృష్టి కేంద్రీకరించాలి' అని కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు అన్నారు.
2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ముఖర్జీని, ఇతర కాంగ్రెస్ నాయకులను అపఖ్యాతి పాల్జేయడం ద్వారా పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడం మమతా బెనర్జీ ఏకైక లక్ష్యం అని ప్రణబ్ ముఖర్జీ ఆంతరంగిక సమావేశంలో అన్నారు. 'నేను బతికి ఉన్నంత కాలం అలా జరగనివ్వను. రాష్ట్రం అభివృద్ధికి సహకరించని మనిషిగా నన్ను ఆమె పేర్కొనవచ్చు. కాని నేను రాష్ట్రానికి, దేశానికి చేస్తున్నది ఏమిటో జనానికి తెలుసు. నాకు ఆమె దగ్గర నుంచి యోగ్యతా పత్రాలు అవసరం లేదు' అని ప్రణబ్ ముఖర్జీ తన సన్నిహిత సహచరుడు ఒకరితో చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 20 February, 2010
|