రాహుల్ ఫోబియా ఎఐసిసి కార్యదర్శులకు, రాహుల్ కు అనుబంధితమైన జితేంద్ర సింగ్, మీనాక్షీ నటరాజన్ వంటి కార్యదర్శులకు మధ్య కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న అంతరమే కొందరు వెటరన్ నాయకులు ఎంత ఆందోళన చెందుతున్నారో సూచిస్తున్నది. రాహుల్ రాజకీయ సహాయకుడు కనిష్క సింగ్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి కన్నా ఎక్కువ శక్తిమంతునిగా పరిగణిస్తుంటారు. రాహుల్ తో సాన్నిహిత్యం కోసం సోనియా విధేయులు ప్రయాస పడుతున్నారనడానికి పార్టీ అధికార శ్రేణిలో దిగ్విజయ్ సింగ్ ఉత్థానంపై వివిధ స్థాయిలలో వ్యక్తమవుతున్న 'ఆందోళనే' సూచిక. ఉత్తర ప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జిగా దిగ్విజయ్ సింగ్ కు రాహుల్ తో మాట్లాడేందుకు, కలసి పని చేసేందుకు అవకాశం లభిస్తున్న కారణంగా ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులలో రాహుల్ గాంధి తరువాత అత్యంత శక్తిమంతుడిగా రూపుదిద్దుకున్నారనే అభిప్రాయం నెలకొన్నది.
దిగ్విజయ్ సింగ్ కు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు తప్పించాలనే ప్రతిపాదన వచ్చింది. కాని ఆయన ఇటీవల 'ఉగ్రవాదుల కేంద్రం'గా పేరుపడిన ఆజమ్ గఢ్ ను సందర్శించిన తరువాత ఆయనకు ఆ బాధ్యతలు తప్పించడం కష్టం కావచ్చు. ఎందుకంటే 2008 సెప్టెంబర్ లో జరిగిన ఢిల్లీ బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో పలువురు అనుమానితులను యుపిలోని ఈ కీలక జిల్లా నుంచే నిర్బంధంలోకి తీసుకున్నారు. అరెస్టయిన పలువురు అనుమానితుల బంధువులను దిగ్విజయ్ సింగ్ ధైర్యంగా కలుసుకుని మాట్లాడినందుకు శిక్షగా ఆయనను యుపి బాధ్యతల నుంచి తప్పించారని ముస్లింలు భావించవచ్చునని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Pages: -1- 2 -3- News Posted: 22 February, 2010
|