స్వరాలతో కాసుల వర్షం ప్రపంచంలోని భారీ మీడియా కంపెనీలలో కొన్ని ఈ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అటువంటి స్థితిలో ఇంటర్నెట్ నుంచి ఎక్కువ రాబట్టుకోగలనని భూషణ్ కుమార్ ఎలా అనుకుంటున్నారు? 'నాలుగు సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ నుంచి ఇతర విధాలుగా రెవెన్యూలో 40 శాతం రాగలదని మేము ఎన్నడూ ఊహించలేదు. నెట్ నుంచి రెవెన్యూ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎవరైనా ఆ విషయంలో గట్టి కృషి చేయవలసి ఉంటుంది. అంతే' అని ఆయన సమాధానం ఇచ్చారు.
తన సంగీతాన్ని ఇప్పటికే ఉపయోగించుకుంటున్న వ్యక్తులు, సంస్థలను వెంటాడిన రీతిలోనే పక్కా వ్యూహంతో నెట్ ను వెంటాడగలనని భూషణ్ ఆశిస్తున్నారు. అయితే, ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఐఎంఐ)లో సభ్యత్వం లేనందున టి-సీరీస్ సంస్థకు తన రికార్డింగ్ లోని పాటల బహిరంగ కచేరీల నుంచి రాయల్టీలు ఏవీ రాలేదు. ఐఎంఐ సభ్య సంస్థల రాయల్టీలను పిపిఎల్ (పబ్లిక్ పర్ఫార్మెన్స్ లిమిటెడ్), ఐపిఆర్ఎస్ (ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ) వసూలు చేస్తుంటాయి.
ఈ సంస్థ తన సంగీతం వాడకానికి లైసెన్స్ ఇవ్వడం ప్రారంభించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఇదే పద్ధతిని ఆతరువాత అనుసరించింది. సంస్థ పాటలను కచేరీలు వంటి కార్యక్రమాలలో ఉపయోగించేవారిని నయాన భయాన అంటే దావాల దాఖలు ద్వారా తనకు ఫీజు చెల్లించే విధంగా సంస్థ ఒప్పించింది. అయితే, రెస్టారెంట్లు, క్లబ్బులు మొదలైనవాటిని దారిలోకి తీసుకురావడానికి సంస్థకు కష్టమే అయింది. అనేక సంవత్సరాల పాటు దాడులు సాగించిన తరువాత పరిస్థితులు చక్కబడినట్లు టి-సీరీస్ మాజీ అధ్యక్షుడు ఎం.ఎం. సతీష్ గుర్తు చేసుకున్నారు. అంత జరిగినా కూడా ఒక క్లబ్ తాను వినిపిస్తున్నది పిపిఎల్ సంగీతాన్నే కాని, టి-సీరీస్ సంగీతాన్ని కాదని సదా వాదిస్తూ వచ్చింది.
Pages: -1- 2 -3- News Posted: 24 February, 2010
|