స్వరాలతో కాసుల వర్షం 'హోటళ్లు, జిమ్ లు, క్లబ్బులలో ఎవరు ఏ పాటలు వినిపిస్తున్నదీ విశ్లేషించడం ఎంతో కష్టమైన పని' అని భూషణ్ కుమార్ చెప్పారు. ఎట్టకేలకు రెండు సంవత్సరాల క్రితం, ఐఎంఐలో పాక్షిక సభ్యత్వం పొందిన తరువాత టి-సీరీస్ తన పబ్లిక్ పర్ఫార్మెన్స్ లైసెన్సింగ్ విభాగాన్ని ఐఎంఐలో విలీనం చేసింది. ఇప్పుడు ఐఎంఐ ఈ సంస్థకు ఏటా కనీస గ్యారంటీని చెల్లిస్తుంటుంది, సంస్థ తరఫున రాయల్టీలను వసూలు చేస్తుంటుంది. తక్కిన మొత్తం టివి, రేడియా టెలికమ్ లకు లైసెన్స్ నేరుగా ఇవ్వడం ద్వారా టి-సీరీస్ కు వస్తుంటుంది.
మరి పిపిఎల్, ఐపిఆర్ఎస్ ద్వారా ఈ విధంగా చేయడం మంచిది కాదా? 38 వేల టైటిల్స్ లేదా రెండు లక్షల పాటలతో కూడిన తన భారీ కేటలాగ్ కు కొనుగోలుదారులతో నేరుగా వ్యవహరించడం విజ్ఞతతో కూడుకున్నదని కుమార్ అన్నారు. అయితే, పిపిఎల్, ఇతర వసూలు సంస్థలు ఏదైనా కంపెనీకి డబ్బును తిరిగి పంపడానికి 12 నుంచి 18 నెలల వరకు వ్యవధి పడుతుందనే విషయాన్ని ఆయన చెప్పలేదు. అలా ఆలస్యం కావడం వల్ల చేతిలో డబ్బు ఆడదు.అందువల్ల వివిధ రీటైలర్లతో నేరుగా లావాదేవీలు సాగించడమే మంచిదని టి-సీరీస్ అనుకుంటున్నది.
ఏడాదికి దాదాపు రెండు చిత్రాలు వంతున చిత్ర నిర్మాణంలో టి-సీరీస్ పాలుపంచుకుంటున్నది. అయినప్పటికీ ఒక సినిమా కంపెనీగా మారే ఉద్దేశం కుమార్ కు లేదు. సంగీతాన్ని కొని, తిరిగి విక్రయిస్తూనే ఎంతైనా వృద్ధి సాధించవచ్చునని ఆయన అంటున్నారు. వాస్తవానికి ఆయన బిగ్ మ్యూజిక్ కు చెందిన 500 టైటిల్స్ కేటలాగ్ కు సహ యజమానిగా ఉంటూ హంగామాతో తిరిగి విక్రయించేందుకు ఆయన ఈమధ్యే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. భూషణ్ కుమార్ ఇప్పుడు అటువంటి ఇతర కేటలాగ్ ల కోసం అన్వేషిస్తున్నారు.
Pages: -1- -2- 3 News Posted: 24 February, 2010
|