పేరుతో ఎంత కష్టం! అహ్మదాబాద్ లో సద్దామ్ హుస్సేన్ లు అనేక మంది ఉన్నారు. వారిలో ఒకడు షాపూర్ లోని 19 ఏళ్ళ రోడ్డు పక్క మెకానిక్. అతను కార్లలో ఎయిర్ కండిషనర్లు అమర్చడంలో నిపుణుడు. 'ఆరు నెలల క్రితం నేను నా మిత్రులతో కలసి గాంధీనగర్ లో ఒక పాపులర్ ప్రదేశానికి వెళ్లాను. నా మిత్రులలో ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లింలు ఉన్నారు. అల్తాఫ్, మహిర్ వంటి పేర్లు ఉన్న వారితో సహా నా మిత్రులను వెళ్లిపోనిచ్చారు. కాని నన్ను ఆపివేశారు. అరగంట సేపు నన్ను ప్రశ్నించారు. నా చిరునామా రాసుకున్నారు. నా పర్సును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేశారు. చాలా బాధ అనిపించింది. నేను ఇక ఎన్నడూ అక్కడికి వెళ్లను' అని అతను చెప్పాడు.
గుజరాత్ లోని మోడసా నుంచి కర్నాటకలోని హుబ్లికి నివాసం మార్చుకున్న ట్రాన్స్ పోర్టర్ ఉస్మాన్ పటేల్ 2002లో హజ్ యాత్ర కోసం జెడ్డాకు విమానం ఎక్కబోతుండగా భద్రతా విభాగం అధికారులు ఆయనను నిలిపివేశారు. ఆయనను విమానం ఎక్కనివ్వలేదు. కారణం? ఆయన కుమారుని పేరు ఒసామా. అతను కూడా ఆయన వెంట వెళుతున్నాడు. 'మమ్మల్ని ఆ మరునాడు విమానంలో వెళ్లనిచ్చారు. కాని ఆనాటి మనోవ్యథ ఇప్పటికీ వేధిస్తున్నది' అని ఆయన చెప్పారు.
ఇక 15 సంవత్సరాల పాఠశాల విద్యార్థి ఒసామా షేఖ్ తన పేరు విషయంలో అసౌకర్యానికి గురవుతుంటాడు. 'నేను ముస్లిం ప్రాంతంలో నివసిస్తున్నందున, స్కూలులో నా మిత్రులు చాలా మంది ముస్లింలే అయినందున నా పేరుతో సమస్య ఏమీ లేదు. కాని నేను బయటకు వెళ్లినప్పుడు ఇది నాకు సమస్యే అవుతుంది. ఉదాహరణకు డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు అనేక ప్రశ్నలు ఉదయిస్తుంటాయి' అని అతను చెప్పాడు. పేరులో ఏముంది అని షేక్ స్పియర్ వ్యాఖ్యానించి ఉండవచ్చు కాని పేరుతోనే ఉంది అసలు తంటా అంతా అని ఆ బాలునికి తెలుసు.
Pages: -1- -2- 3 News Posted: 1 March, 2010
|