వార్తలకు 'నెట్' 'అమెరికన్లు ఆన్ లైన్ లోను, ఇతర విధాలుగాను కూడా వార్తలు చదివేవారయ్యారు. అయితే పరిమితులు దాటడం లేదు' అని ప్యూ రీసర్చ్ సెంటర్స్ ప్రాజెక్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అమీ మిచెల్ తెలియజేశారు. 'వారికి అమిత ప్రియమైన వెబ్ సైట్ అనేది ఏదీ ఉండదు. అయితే, వారు లక్ష్యరహితంగా వెబ్ సైట్ లను పరిశీలించరు' అని ఆమె తెలిపారు. 'ఆన్ లైన్ లో వార్తలు చూసేవారిలో చాలా మంది ఏవో కొన్ని సైట్ లను మాత్రమే చూస్తుంటారు' అని ఆమె తెలిపారు.
సెల్ ఫోన్ కలిగి ఉన్నవారిలో 33 శాతం మంది తమ మొబైల్ ఫోన్లలో వార్తలు చూస్తుంటారని కూడా సర్వేలో వెల్లడైంది. 'ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకోవాలని అభిలషించేవారు ఏవిధంగానైనా వార్తలు తెలుసుకుంటున్నారు' అని ప్యూ రీసర్చ్ సెంటర్స్ ఇంటర్నెట్, అమెరికన్ లైఫ్ ప్రాజెక్ట్ సంస్థలో పరిశోధన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ క్రిస్టెన్ పుర్సెల్ చెప్పారు. సిఎన్ఎన్, బిబిసి, స్థానిక లేదా జాతీయ దినపత్రికలతో పాటు గూగుల్ న్యూస్, ఎఒఎల్, టాపిక్స్ వంటి పోర్టల్ వెబ్ సైట్ లను ఆన్ లైన్ లో వార్తలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
ఇంటర్నెట్ యూజర్లలో 37 శాతం మంది వార్తల సృష్టికి తాము దోహదం చేశామని, వాటిపై వ్యాఖ్యలు పంపామని, ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్ లలో పోస్టింగ్ ల ద్వారా వాటిని ఇతరులకు తెలియజేశామని చెప్పారు. ఆన్ లైన్ లో వార్తలు తెలుసుకునేవారిలో 75 శాతం మంది ఇమెయిల్ లేదా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో పోస్టింగ్ ల ద్వారా వార్తలను పంపారు. 52 శాతం మంది తాము ఇతరులతో వార్తలను పంచుకుంటామని చెప్పారు. న్యూస్ మీడియా గురించి అభిప్రాయాలను కూడా ఈ సర్వే కోరింది. 'ముఖ్యమైన వార్తా కథనాలను, నాకు కావలసిన విషయాలను ప్రధాన వార్తా సంస్థలు చక్కగా కవర్ చేస్తున్నాయి' అనే ప్రకటనతో తాము ఏకీభవిస్తున్నట్లు 63 శాతం మంది తెలియజేశారు. అయితే, 'వార్తా సంస్థలలో అధిక భాగం తమ కవరేజిలో పక్షపాతం ప్రదర్శిస్తుంటాయి' అనే ప్రకటనతో 71 శాతం మంది ఏకీభవించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 19 వరకు ఈ సర్వే నిర్వహించారు.
Pages: -1- 2 News Posted: 2 March, 2010
|