తెలుగు సినిమా వసంతం
ఆస్టిన్ : మంచి లక్ష్యం, మంచి ప్రతిభ ఉంటే తెలుగు సినిమా రంగంలో మంచి విలువల్ని తీసుకు రావచ్చని, ఇప్పుడున్న వాతావరణంలో తెలుగులో కొత్త తరం దర్శకులు ఇవి సాధించగలుగుతున్నారని నటుడు అవసరాల శ్రీనివాస్ అన్నారు. ఆస్టిన్ లోని టెక్సస్ విశ్వవిద్యాలయంలో తానా సహకారంతో తెలుగు విద్యార్ధుల సమాఖ్య నిర్వహిస్తున్న తెలుగు సినిమా వసంతం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సెమిస్టర్ అంతా జరిగే తెలుగు సినిమా వసంతంలో తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాల్లాంటి అనేక చిత్రాలను ప్రదర్శించనున్నారు. శుక్రవారం జరిగిన ప్రారంభ సభకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, అధ్యాపకులు, వివిధ రాష్ల్రా నుంచి తెలుగు సంఘాల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర పోషించిన 'అష్టా చమ్మా' చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంపై జరిగిన చర్చలో శ్రీనివాస్ అవసరాల మాట్లాడారు. సినిమా నిర్మాణం, కథ, నటన, సాంకేతిక అంశాల మీద ఆసక్తికరమైన చర్చ జరిగింది. తెలుగు సినిమా ఇప్పుడు గొప్ప మలుపులో ఉందని, నిజ జీవితానికి దగ్గరగా ఉండేట్టుగా చిత్రాలు ఉడాలన్న సంకల్పం కొత్త తరం దర్శకులలో ఉదని ఆయన అన్నారు. ఈ చిత్రంలో నటించడం తనకు గొప్ప అనుభవమని, మరచిపోలేని సినిమా పాఠమని ఆయన అన్నారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఏ ప్రయత్నమయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆహ్వానించదగిన చర్య అని, ఈ దిశగా టెక్సస్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా సంస్కృతుల విస్తరణలో తానా చేస్తున్న కృషి హర్షణీయమని ఆయన అన్నారు.
Pages: 1 -2- News Posted: 17 February, 2009
|