తెలుగు కళా సమితి ఆహ్వానం
న్యూజెర్సీ : తెలుగు కళా సమితి (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ -టి.ఎఫ్.ఎ.ఎస్) 25వ (సిల్వర్ జూబ్లీ) వార్షికోత్సవం సందర్భంగా 'నిధుల సేకరణ విందు' (ఫండ్ రైజింగ్ డిన్నర్)ను ఏర్పాటు చేసినట్లు సంస్థ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు దాము గేదల ఒక ప్రకటనలో తెలిపారు.న్యూజెర్సీలోని 1050 కింగ్ జార్జెస్ పోస్ట్ రోడ్, ఫోర్డ్ 08863 చిరునామాలోని రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ లో మార్చి 21 సాయంత్రం 6 గంటలకు ఈ విందు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ఈ నిధుల సేకరణ విందుకు అతిథులుగా అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనితా కృష్ణ బృందం సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే కార్యక్రమానికి అనుమతి ఉంటుందని దాము గేదల తన ప్రకటనలో వివరించారు. ఇతర వివరాల కోసం www.tfas.net, లేదా www.tfasnj.ort వెబ్ సైట్లలో చూడవచ్చు. లేదా మరింత వివరాలు కావాల్సిన వారు
Damu Gedala 856 577 7112, 732 662 4559
Manju Bhargava 973 715 8944, 973 983 0596
Rohinikumar Vemula 973 722 5525, 973 884 1633
Lakshmi Mallela 932 274 9356, 732 236 1394
Girija Kolluri 609 462 8661, 609 799 6302
Anand Paluri 201 207 3214, 732 656 1913
Ramakrishna Seethala 609 933 3180, 609 936 9195
Satya Nemana 732 762 7104, 732 264 5756
Indira Yelamanchi 609 649 2817, 609 890 1232
టెలిఫోన్ నెంబర్లలో సంప్రతించవచ్చు.
తెలుగు కళా సమితి 25వ (సిల్వర్ జూబ్లీ) వార్షికోత్సవం వచ్చే మే నెల 23, 24 తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ లో జరుగుతాయని దాము గేదల ప్రకటనలో వెల్లడించారు.
News Posted: 7 March, 2009
|