మోడీకి బెయిల్
జైపూర్:రాజస్థాన్ లో దాఖలైన ఫోర్జరీ కేసులో నిందితుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అధిపతి లలిత్ మోడీకి బొంబాయి హైకోర్టు మంగళవారం యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేందుకు 2004 సెప్టెంబర్ 4న కొన్ని సంతకాలు ఫోర్జరీ చేసి, భూమి కొనుగోలు చేశారని ారోపిస్తూ రాజస్థాన్ నాగౌర్ జిల్లాలోని గొగోర్ గ్రామానికి చెందిన రూపా రామ్ ఝాట్ ఈ యేడాది జనవరి 27న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం అసోసి్యేషన్ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు నివసించి వుండాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయి వుండాలి. లేదా సొంత జిల్లాలో శాశ్వత ఆస్తి కలిగి వుండాలి. భూమి రిజిస్ట్రేషన్ అయిన సమయంలో మోడీ నాగౌర్ లో లేనందువల్ల ఆయన సంతకం ఫోర్జరీతో తప్పుడు పత్రాలు దాఖలయ్యాయని రూపా రామ్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
తనను ఏ క్షణంలోనైనా అరెస్టుచే్స్తారన్న భయంతో, ఐపిసి 226, 482 సెక్షన్ల కింద మోడీ బొంబాయి హైకోర్టులో బెయిల్ దరఖాస్తు దాఖలు చేశారని ఆయన తరఫు న్యాయవాది మహమూద్ అబ్దీ చెప్పారు. కేవలం రాజకీయ ప్రతీకారం తీర్చుకోడానికే ఈ కేసు వేశారని ఐపిఎల్ కూడా పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేసింది. మోడీకి ఇప్పటి నుండి మూడు వారాల పాటు బెయిల్ మంజూరుచేస్తూ న్యాయమూర్తి వి.ఎం.ఖడే ఉత్తర్వులు జారీచేశారు.
గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో వసుంధర రాజె ప్రభుత్వం పరాజయంపాలైన తరువాత లలిత్ మోడీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ ఫోర్జరీ కేసుతోపాటు మరికొన్ని క్రిమినల్ కేసులు ఆయనపై నడుస్తున్నాయి. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ లో తిగుగుబాటును కూడా ఆయన ఎదుర్కొంటున్నారు.
News Posted: 9 February, 2009
|