పీకల్లోతు ప్రేమలో షరపోవా!
లండన్: టెన్నిస్ క్వీన్ మరయ షర్పొవా మనసు ఇప్పుడు ఆటమీద లగ్నం చేయలేకపోతోందట. తన కలల రాకుమారుడి ప్రేమ మీద ధ్యాసతో, ఆఖరికి తండ్రి యురి మాటను కూడా లక్షపెట్టడం లేదన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె తోటి క్రీడాకారిణి అన్నా షెవతజె తండ్రి జమల్ చెబుతున్న మాటలివి. 'మరయ మనసు ప్రస్తుతం టెన్నిస్ మీద లేదు. పూర్తిగా ప్రేమలో ములిగిపోయింద'ని జమల్ షెవతజెను ఉటంకిస్తూ మాస్కో దినపత్రిక డెయిలీ ఎక్స్ ప్రెస్ పేర్కొంది.
తాను మరయ తండ్రి యురితో చాలా రోజుల క్రితం మాట్లాడానని, కుమార్తెమీద తన ప్రభావం పూర్తిగా కోల్పోయానని ఆయన ఎంతో బాధపడుతున్నాడని ఆమె చెప్పింది. 'మరయకు ఇప్పుడు తన ప్రియుడు తప్ప వేరొకరితో పనిలేదు. మరయ ఈడు ఆడపిల్ల నాకుకూడా ఉన్నందువల్ల యురి బాధను అర్ధం చేసుకోగలను' అని ఆయన అన్నాడు.
News Posted: 12 February, 2009
|