ఐపిఎల్ కు బిగ్ టివి గుడ్ బై
ముంబాయి: రిలయన్స్-అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(ఆర్-ఎడిఎజి) అధీనంలోని బిగ్ టివి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) భాగస్వామ్యం నుంచి తప్పుకుంది. లీగ్ ప్రసార హక్కులు గల సోని ఎంటర్ టైన్ మెంట్ టెలివిజన్(సెట్) వివిక్ష చూపుతోందని బిగ్ టివి ఆరోపించింది. ప్రసార భాగస్వామ్యానికి తాము తక్కువ ధరను పేర్కొన్నా, ఎయిర్ టెల్ డిటిహెచ్ కే కాంట్రాక్టు ఇవ్వాలని సెట్ నిర్ణయించిందని ఆరోపిస్తూ, తాము పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ఐపిఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్ కు బిగ్ టివి తెలియజేసింది.ధర్ల నిర్ణయంలో బిగ్ టివి, దాని ప్రత్యర్ధి మధ్య సోనీ ప్రదర్శించిన వివక్షే ఇందుకు కారణమని ఈ వ్యవహారానికి సన్నిహితులైన వర్గాలు వెల్లడించాయి. గ్రౌండ్ బ్రాండింగ్, ప్రసారాలకు సంబంధించి భాగస్వామ్య హక్కుల కోసం బిగ్ టివి బిసిసిఐతో గత సంవత్సరం 137 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు బిగ్ టివి ప్రతినిధి, సోని కంపెనీ అధ్యక్షుడు రోహిత్ గుప్తా నిరాకరించారు.
News Posted: 13 February, 2009
|