ఐపిఎల్ లో 'పెప్సీ' టీమ్స్!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కటా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ను స్పాన్సర్ చేట్తున్న భాగస్వాముల్లో పెప్సీ కో చేరుతోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలమీద వచ్చే వారం సంతకాలు జరగనున్నాయి. ఏడాదిపాటు అమలులో వుండే ఒప్పదంలో ఐపిఎల్ సీజన్ ప్రధాన ఘట్టంగా భావిస్తున్నారు. గత సంవత్సరం పెప్సికో 50 కోట్ల రూపాయలకు ఐపిఎల్ తో కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పందం మధ్యలోనే రద్దయిపోయింది. మరోవైపు ప్రత్యర్ధి కంపెనీ కోకా కోలా జిఎంఆర్ కంపెనీ ప్రమోట్ చేస్తున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఈ సీజన్ కు ఒప్పదం కుదుర్చుకుంది.
కోకా కోలా గత సంవత్సరం ప్రీతి జింటా, నెస్ వాడియా, మొహిత్ బర్మన్ ప్రమోట్ చేసిన కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టును స్పాన్సర్ చేసింది. ఐపిఎల్ లీగ్ లో తన ఉనికిని స్పష్టంగా చాటుకోవాలనీ నిర్ణయించామని, ప్రస్తుతం కొందరు ఐపిఎల్ ఫ్రాంచైజీలతో భాగస్వామ్య అవకాశాలపై సంప్రతింపులు జరుపుతున్నామని పెప్సికో ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ సింగ్ అరోరా చెప్పారు. పెప్సికో తమ బ్రాండ్ ను తమతో కలసి ఉమ్మడిగా ప్రమోట్ చేస్తుందని చెన్నై సూపర్ కింగ్స్ అధిపతి, ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ విభాగం జాయింట్ ప్రెసిడెంట్ ధ్రువీకరించారు. పై మూడు ట్లకు చెందిన ఆటగాళ్లతో ప్యక్తిగతంగా కూడా పెప్సికో లావాదేవీలు జరుపుతోంది. వివరాలు ఇప్పుడే బయటపెట్టడం సాధ్యంకాదని కొల్ కటా నైట్ రైడర్స్ ప్రతినిధి జీత్ బెనర్జీ చెప్పారు.
News Posted: 13 February, 2009
|