ఆటగాళ్లకోసం విపరీత ఖర్చు
లండన్: లిటిల్ మాస్టరం సచిన్ టెండుల్కర్ తో సహా అగ్రశ్రేణి ఆటగాళ్లపై రాయల్ బ్యాక్ ఆఫ్ స్కాట్లండ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెడ్ గుడ్ విన్ 200 మిలియన్ పౌండ్లు ఖర్చుచేశారని ఒక వార్తా పత్రిక వెల్లడించింది. 'స్పాన్సర్ షిప్ పేరుతో ఖాతాదారుల వినోదంకోసం అత్యున్నత శ్రేణి క్రీడాకారులను కాంట్రాక్టు కింద తీసుకోడానికి రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్ 200 మిలియన్ పౌండ్లు 'నిర్లక్ష్యంగా'ఖర్చుచేసింద'ని సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. బ్యాక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్ ఫ్రెడ్ గుడ్ విన్ గత అక్టోబర్ లో పదవినుంచి తొలగించబడడానికి కొద్ది వారాల ముందే ఈ ఆటగాళ్లతో ఐదేళ్ల కాంట్రాక్టుకు ఒప్పదం కుదిర్చారని, భారత క్రికెట్ హీరో సచిన్ టెండుల్కర్ ఆ కాంట్రాక్టుమీద సంతకం చేశాడని సండే టైమ్స్ వెల్లడించింది. బ్రిటిష్ వాణిజ్య చరిత్రలో అతి భారీ నష్టాన్ని(28 బిలియన్ పౌండ్లు) గత నెలలో నమోదుచేసిన రాయల్ బ్యాంక్, గుడ్ విన్ హయాంలో జరిగిన ఒప్పందాలను అమలుపరచక తప్పదు.
News Posted: 15 February, 2009
|