ఢిల్లీ గేమ్స్ కు 2,360 కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే యేడాది కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించనున్న ఢిల్లీ నగరానికి భారీ మొత్తాన్ని(రూ.2,360 కోట్లు)2009-10 కేంద్ర బడ్జెట్ లో కేటాయించారు. ఇది గత సంవత్సరం కేటాయింపు కంటె 1,600 కోట్ల రూపాయలు ఎక్కువ. కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు ప్రాథమిక సౌకర్యాల కల్పన కోసం ఢిల్లీ నగరానికి వెయ్య కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 2008-09 సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.400 కోట్లు మాత్రమే.
News Posted: 16 February, 2009
|