న్యూఢిల్లీ: భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యుటిఎ ర్యాంకింగ్ లలో సింగిల్స్ లో తిరిగి 'టాప్ 100'లో స్థానం సంపాదించింది. థాయిలాండ్ లోని పట్టాయా ఓపెన్ లో అద్భుత విజయాలు సాధించిన అనంతరం హైదరాబాదీ సానియా తాజా డబ్ల్యుటిఎ ర్యాంకింగ్ లలో 39 స్థానాలు పురోగమించింది.
తాజా ర్యాంకింగ్ ల జాబితా సోమవారం వెలువడింది. పట్టాయా ఓపెన్ లో ఆమె ఫైనల్ లో ప్రపంచ నంబర్ 5 క్రీడాకారిణి వెరా జ్వొనరేవా చేతిలో ఓడిపోయింది. సానియా ఇప్పుడు ప్రపంచ క్రీడాకారిణులలో 87వ స్థానం ఆక్రమించింది. మణికట్టు గాయం కారణంగా ఆమె 2008 సంవత్సరంలో చాలా కాలం ఆటకు దూరమైన విషయం విదితమే.