వరల్డ్ కప్ షెడ్యూల్ యధాతథం
న్యూఢిల్లీ: రెండేళ్లలో(2011)జరుగనున్న క్రికెట్ ప్రపంచ కప్ పోటీల షెడ్యూల్ లో ఎటువంటి మార్పులు చేయరాదని ఇక్కడ జరిగిన సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 2011 ఫిబ్రవరి 19న ప్రారంభోత్సవం జరుగుతుంది. మిగతా ఆతిధేయ దేశాల మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి మొట్టమొదట రూపొందించిన షెడ్యూల్ నే అనుసరిస్తాయి.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియాలోను, సెమీ ఫైనల్ మ్యాచ్ లు పాకిస్తాన్, శ్రీలంక లోను జరుగుతాయి. టోర్నమెంట్ లోని నాలుగు పోటీలు పాకిస్తాన్ లో, 8 మ్యాచ్ లు ఇండియాలోను జరుగుతాయి.
పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగా నిర్ణయించిన తేదీనాటికి పూర్తికావాలని అంతర్జాచీయ క్రికెట్ కౌన్సిల్ గత సంవత్సరమే పోటీలు నిర్వహిస్తున్న దేశాలను ఆదేశించింది. ముంబాయిలో గత సంవత్సరం పేలుళ్లు జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్-ఇండియాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వరల్ఢ్ కప్ పోటీల నిర్వహణ అయోమయంలో పడింది.
ఇంకా ్నేకమంది ప్రముఖ క్రికెటర్లు గత నవంబర్ టెర్రరిస్టు దాడులకు, భద్రతాపరమైన లోపాలకు భయపడి వివిధ దేశాలజట్లు ఈ ప్రాంతంలో ఉండడానికి, ప్రయాణాలు సాగించడానికి జంకుతున్నాయి. అయితే వరల్డ్ కప్ అధికారులు లాహోర్ లోని సెక్రటేరయట్ లో ఉంటారు కాబట్టి వారి భద్రతకు ఎటువంటి ముప్పు ఉండబోదని, పాక్, భారత దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎలాంటి సమస్యలు సృష్టించవని పాకిస్తాన్ క్రికెటం బోర్డు అధ్యక్షుడు ఇజాజ్ భట్ అన్నారు.
News Posted: 17 February, 2009
|