పాక్ లో పోటీలుండవా?
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లను పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి మార్చే అవకాశాలను పరిశీలీంచాలని 2011 ప్రపంచ కప్ పోటీల నిర్వాహకులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఆసిసి)కోరింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో నెలకొన్న సంక్షోభాన్ని గమనించిన ఐసిసి ఈ సూచన చేసింది. న్యూఢిల్లీలో వరల్డ్ కప్ సెంట్రల్ ఆర్గనైజదింగ్ కమిటీ సమావేశం అనంతరం ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరూన్ లోర్గాట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్ పాలకవర్గానికి పాకిస్తాన్ సంక్షోభం పరిశీలించదగ్గ అఁశమని, అందుకే అవసరమైతే ప్రత్యామ్నాయ నగరాలు స్టేడియంలను పరిశీలించవలసిందిగా నిర్వాహకులను కోరిందని తెలిపారు. ఈ అఁశంపై మంగళవారం సమావేశంలో చర్చించలేదని లోర్గట్ చెప్పారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఐపిఎల్ చీఫ్ లలిత్ మోడీతో ఈ విషయాలన్నీ చర్చించామని, ఆ టోర్నమెంట్ జరిగే సమయంలో యాంటీ కరప్షన్, సెక్యూరిటీ యూనిట్(ఎ.సి.ఎస్.యు)అధికారులను ఇండియా పంపించే విషయాన్ని కూడా చర్చించామని లోర్గాట్ తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాకిస్తానే క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ిజాజ్ భట్, సిఇఒ సలీం అల్తాఫ్, బిసిసిఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నాకర్ షెట్టి, శ్రీలంక క్రికెట్ బోర్డు సిఇఒదులీప్ మెండిస్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు, ఐసిసి ముఖ్య సలహాదారు ఐ.ఎస్.బింద్రా పాల్గొన్నారు. పాకిస్తాన్ కు చెందిన సలీం బట్ ను మేనేజింగ్ డైరక్టర్ గా నియమించారు.
News Posted: 17 February, 2009
|