కోలా కొత్త దోస్త్ ఖాన్
న్యూఢిల్లీ: వచ్చే ఐపిఎల్ టోర్నమెంట్ లో షారుక్ ఖాన్ ప్రమోట్ చేస్తున్న కోల్ కటా నైట్ రైడర్స్(కెకెఆర్)జట్టును కోకా కోలా కంపెనీ స్పాన్సర్ చేయడానికి ఒప్పందం కుదిరింది. పెప్సీకో తన బ్రాండ్ అంబాసిడర్ హోదానుంచి షారుక్ ను తప్పించిన కొద్ది రోజుల్లోనే ఈ కొత్త ఒప్పందం కుదిరింది. 'ఐపిఎల్ లో కోకా కోలాతో స్పాన్సర్ షిప్ ఒప్పందాన్ని కుదుర్చకున్నాం. ఇందులో భాగంగా కంపెనీ లోగోను ఉపయోగించి, దాని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తామ'ని కెకెఆర్ డైరక్టర్ జోయ్ భట్టాచార్య పిటిఐ విలేకరికి చెప్పారు. ఈ కాంట్రాక్టు ప్రత్యేకించి ఐపిఎల్ సీజన్ కు సంబంధించిందని, కోకా కోలా ఉత్పత్తి అయిన స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్ ను ప్రమోట్ చేస్తామని ఆయన అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించడానికి ఆయన తిరస్కరించారు. కోకా కోలా కంపెనీ ప్రతినిధులు కూడా వ్యాఖ్యానించేందుకు తిరస్కరించారు.
News Posted: 17 February, 2009
|