మళ్లీ తెరపై కోలా వార్
న్యూఢిల్లీ: కోకా కోలా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పెప్సికో హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీల మధ్య కొద్ది సంవత్సరాల క్రితం చల్లారిన ప్రచ్ఛన్నయుద్ధం, వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ టోర్నమెంట్ సీజన్ లో మళ్లీ భీకర రూపు దాల్చే అవకాశం వుంది. ఐపిఎల్ లీగే లో పాల్గొంటున్న ఎనిమిది జట్లతో స్పాన్సరం షిప్ ఒప్పందాలకోసం ఈ రెండు కంపెనీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
తమ బ్రాండ్ అంబాసిడర్ గా బాలివుడ్ స్టార్ షారుక్ ఖాన్ ను పెప్సికో తొలగించి దశాబ్దకాలం అనుబంధాన్ని తెంచుకుంది. ధీంతో ఖాన్ కు చెందిన కోల్ కటా రైడర్స్ (కెకెఆర్)జట్టుతో స్పాన్సర్ షిప్ ఒప్పందంపై కోలా కంపెనీ సంతకాలు చేసింది. కెకెఆర్ సీనియర్ అధికారి ఒకరు ీ విషయాన్ని ధ్రువీకరించినప్పటికీ, కోకా కోలా ప్రతినిధి మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. కోలాతో ఒప్పందాన్ని కొద్ది రోజుల క్రితమే కుదుర్చుకున్నామని, అది స్ప్రైట్ డ్రింక్ స్పాన్సర్ షిప్ కు సంబంధించిందని, ఐపిఎల్ పోటీల సమయంలో ఆ బ్రాండ్ కు ప్రచారం ఇవ్వాలని కోకా కోలా కంపెనీ నిర్ణయించుకుందనని కెకెఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోయ్ భట్టాచార్య చెప్పారు.
యువతరం బ్రాండ్ అబాసిడర్ లకు ప్రచార అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో షారుక్ ఖాన్ తో ఒప్పందాన్ని పెప్సికో గత వారమే రద్దుచేసింది. అయితే వ్యాపారానికి సంబంధించిన చర్చలపై తాము వ్యాఖ్యానంచబోమని పెప్సికో మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పునీత లాల్ చెప్పారు.పద్హేను రోజుల క్రితం కోకా కోలా కంపెనీ పెప్సికోను పక్కకు నెట్టి, జిఎంఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మరో స్పాన్సర్ షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విశేషం ఏమిటంటే, ఢిల్లీ జట్టు కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్, కెకెఆర్ ఆటగాడు ఇషాంత్ శర్మ పెప్సి కంపెనీ కొత్త కోలా అడ్వర్టయిజ్ మెంట్ లో కలిసి పాల్గొన్నారు.
News Posted: 18 February, 2009
|