టీమ్ ఇండియా కొత్త జెర్సీ
ముంబాయి: ఈ నెలాకర్లో అత్యంత కీలకమైన న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెటం జట్టు, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ముదర నీలం రంగు కొత్త జెర్సీలను ధరిస్తుంది. ఈ డ్రెస్ లను బుధవారం నాడిక్కడ ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ధరిస్తున్న లేత నీలం రంగు జెర్సీలను ప్రత్యామ్నాయ డ్రెస్ గా ఉపయోగిస్తారు. టీమ్ ఇండియా గత రెండు సంవత్సరాల్లో జెర్సీలను మార్చడం ఇది రెండోసారి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, దినేష్ కార్తిక్, ప్రగ్యన్ ఓఝా, రోహితే శర్మ కొత్త జెర్సీలను ఆవిష్కరించారు. మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, రాబిన్ సింగ్, వినోద్ కాంబ్లి, ఎల్ శివరామకృష్ణన్ పాత జెర్సీలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఈ కొత్త జెర్సీ అంత తొందరగా మాసిపోద'ని ధోనీ అన్నాడు.
News Posted: 18 February, 2009
|