న్యూజిలాండ్ టూర్ షురూ
ముంబాయి: వహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెటం జట్టు గురువారం తెల్లవారుజామున న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరింది. 47 రోజులపాటు జరగనున్న ఈ పర్యటనలో రెండు ట్వంటీ మ్యాచ్ లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడతారు. పరిమిత ఓవర్ల పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు ముంది పయనమయ్యారు. ట్వంటీ, వన్డే జట్లలో లేని టెస్ట్ ఆటగాళ్లు తరవాత వెళ్తారు.
జట్టు: ఎ.ఎస్.ధోని(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్ (వైస్ కెప్టెన్), గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇషాంత్ శర్మ, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, రవీంద్ర జడేజా, మునాఫ్ పటేల్, ప్రగ్యన్ ఓఝా, ప్రవీణ్ కుమార్, దినేశ్ కార్తిక్, సచిన్ టెండుల్కర్.
News Posted: 18 February, 2009
|