ట్వంటీకి పాంటింగ్ డుమ్మా
కోల్ కటా: ప్రపంచ ట్వంటీ20 క్రికెట్ లో అతిపెద్ద టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ ఇంకా ప్రారంభం కానేలేదు కాని అప్పుడే వెనుకడుగులు మొదలయ్యాయి. స్టారం బ్యాట్స్ మన్ రికీ పాంటింగ్ కోలం కటా నైట్ రైడర్స్ జట్టునుంచి వైదొలగనున్నాడు. ఇంతకుముందుగానే నిర్ణయమైన అంతర్జాతీయ పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు విధిగా పాల్గొనాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఒకవేళ ఆస్ట్రేలియా క్రికెటం బోర్డు అనుమతి తీసుకున్నా పాంటింగ్ ఐపిఎల్ లీగ్ మ్యాచ్ లు ఐదారింటి కంటె ఎక్కువ ఆడలేడు. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ ఇంకా ధ్రువీకరించవలసి వుందని నైట్ రైడర్స్ అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ యేడాది పోటీలనుంచి తప్పుకోవాలని అతడు ముందే నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అయితే షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్ కటా జట్టు అధికారులకు మాత్రం పాంటింగ్ నిర్ణయం ఎటువంటి కలవరం కలిగించలేదు. అతడికి బదులుగా ఆటగాళ్లను అప్పుడే సిద్ధంచేశామని చెప్పారు. మోర్ని వాన్ విక్, లూక్ రైట్, చమర కపుగడెర లలో ఒకరిని ఎంపికచేస్తామన్నారు. సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని కోల్ కటా నైట్ రైడర్స్ జట్టునుంచి పాక్ బౌలర్ ఉమర్ గుల్ కూడా తప్పుకున్నాడు. భారతదేశంలో ఆడడానికి పాక్ ఆటగళ్లకు భద్రతా కారణాలదృష్ట్యా ఆ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
News Posted: 20 February, 2009
|