బిగ్ టివికి మళ్లీ ఆఫర్
న్యూఢిల్లీ: అధిక మొత్తంలో ఆదాయం సమకూర్చే స్పాన్సర్ ను చేజార్చుకోకూడదన్న ఆలోచనతో రిలయన్స్ అనిల్ధీరూబాయ్ అంబానీ గ్రూప్ కు చెందిన డైరెక్ట్ టు హోమ్ చానల్ బిగ్ టివితో ట్వంటీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల ప్రసారానికి సంబంధించి కొత్త ఒప్పందానికి సోనీ ఎంటర్ టైన్ మెంట్(ప్రస్తుతం మల్టీ స్క్రీన్ మీడియా),ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. బిగ్ టివి వైదొలగడంతో స్పాన్సర్లు లేకుండా పోయిన ప్రసార హక్కులను ఎయిర్ టెల్ డిటిహెస్ తిరస్కరించడంతో, మరోసారి బిగ్ టివి స్పాన్సర్ షిప్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఐపిఎల్ పోటీల బ్రాడ్ కాస్టింగ్ హక్కులను ఇ.ఎస్.పి.ఎన్ చేజిక్కించుకోవచ్చని కూడా సోనీ భయపడుతోంది.
ప్రస్తుతం సోనీ, ఐపిఎల్ ప్రతినిధులు బిగ్ టివి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ కొత్త ఆఫర్ లో ఐపిఎల్ 70 కోట్ల రూపాయలు, సోనీ సుమారు 15 కోట్ల రూపాయలు ప్రతిపాదించాయని తాజా పరిణామాలను పరిశీలిస్తున్న వర్గాలు వెల్లడించాయి. అయితే గతంలో అంగీకరించిఅమలు పరచిన షరతులను పునరుద్ధరిస్తేనే ఒప్పందానికి అంగీకరిస్తామని బిగ్ టివి అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. గత సంవత్సరం ఐపిఎల్ తో గల నాలుగేళ్ల 137 కోట్ల రూపాయల ఒప్పందాన్ని బిగ్ టివి గత వారం రద్దు చేసుకుంది. సోనీ కంపెనీ ధరల విషయంలో పాటిస్తున్న వివక్ష తమ నిష్క్రమణకు కారణమని చెప్పింది. తన నిర్ణయాన్ని ఐపిఎల్ సిఇఒ సుందర్ రామన్ కు ిదివరకే తెలియజేసింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఆయన సోనీ కంపెనీని కోరారు.
News Posted: 20 February, 2009
|