అంతా మన మంచికే
భారత క్రికెట్ జట్టు 1976 నుంచి న్యూజిలాండ్ లో ఇంతవరకూ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలుపొందలేదు. ఒక్క వన్డే సిరీస్ కూడా గెలుచుకోలేదు. అంతకుముందు టెస్ట్ సిరీస్ గెలిచింది 1968లో. హిమాలయ పర్వతాలు ఎక్కుతున్నంత కష్టమనిపించే గణాంకాలివి.
ఏదో కట్టుకథలా కనిపించవచ్చు. ఆరుగురు సర్ వివియన్ రిచర్డ్స్ లు, నలుగురు మాల్కం మార్షల్స్ ఉన్న జట్లతో పోటీ పడ్డట్టనిపించ వచ్చు. ఇదంతా నిజం కాదు కాని, ఒక దుర్భేధ్యమైన కోటలా, పరాజయమెరుగని జట్టులా న్యూజిలాండ్ కనిపించవచ్చు. గతంలో ఎందరో ఉత్తమ ఆటగాళ్లు అక్కడ పర్యటనకు వెళ్లి, రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. అందుకు కారణం ఏదో ఒకటి వుండితీరుతుంది.
బహుశా భారతజట్టు న్యూజిలాండ్ లో తగిన్ని మ్యాచ్ లు ఆడలేదేమో! 1976లో ఆఫ్ స్పన్నర్ ఎర్రపల్లి ప్రసన్న, ఆక్లండ్ లో తేమ ఆరిపోయి, ఎండిపోతున్న పిచ్ మీద కివీస్ బ్యాట్స్ మెన్ ను గింగరాలు తిప్పినప్పటినుంచి, భారతజట్టు ఇంతవరకూ కేవలం 11 టెస్ట్ మ్యాచ్ లే ఆడింది. ఈ సంఖ్య అర్ధరహితంగా అనిపించవచ్చు. అంతేకాకుండా టూర్ల మధ్య విరామం మరీ ఎక్కువకావడం ఇందుకు కారణం కావచ్చు. క్రితంసారి భారతజట్టు న్యూజిలాండ్ లో మూడు టెస్ట్ ల సిరీస్ 1990లో ఆడింది. ఫలితంగా అక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్ కండిషన్లు మనవాళ్లకి తగినంతగా అర్ధంకాకపోవడం, తీరా వాటిని అవగాహన చేసుకున్నామనుకునే సమయానికి ఆ టూర్ కాస్తా ముగిసిపోయి భారతజట్టు రికార్డు బోసిపోవడం జరిగిపోతోంది. ఇదంతా వాస్తవమే అయినప్పటికీ, ఓటమికి సరైన కారణం కాదు. అందువల్ల కారణాలకోసం మరింత తరచి చూస్తే రెండు ప్రధానమైన విషయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. న్యూజిలాండ్ జట్టును తక్కువగా అంచనా వేయడం వాటిలో ఒకటి. భారతజట్టు మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయం సాధించింది న్యూజిలాండ్ పైనే అన్న విషయాన్ని పక్కనపెడితే, అక్కడ పర్యటనకు వెళ్లే జట్ల గరించి అంతగా పట్టించుకోకపోవం రెండో కారణం. ఇంగ్లండ్, ాస్ట్రేలియా లేదా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా టూర్లకు వెళ్లేటప్పుడు కనబరిచే ఉత్సాహం, ఉద్వేగం న్యూజిలాండ్ విషయంలో కనబరచకపోవడం గమనార్హం. అక్కడి క్రికెట్ సందడి గురించి మనకంతగా తెలియకపోవడం, సమయాలలో వ్యత్యాసం కారణం కావచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా న్యూజిలాండ్ లో మంచి క్రికెటర్లు కొందరు తయారయ్యారు. హాడ్లీ, క్రో కాదు, వాళ్లు లెజెండ్ లు. జాన్ రైట్, ఆండ్రూ జోన్స్, ఇయాన్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, షేన్ బాండ్ లాంటివాళ్లు కూడా కాదు. వీళ్లూ ఎంతో పేరుపొందినవారే. డియాన్ నాష్, గవిన్ లార్సన్, డారిల్ టఫీ, జాకబ్ ఓరమ్ లాంటి ఆటగాళ్లను తక్కువ అంచనావేసి మనం దిగజారిపోయాం. లక్షాన్ని గురిచూసి ఛేదించడంలో సిద్ధహస్తులైన వేటగాళ్లలాంటి ఈ క్రికెటర్లు వాళ్లను అర్ధంచేసుకునేలోగానే, ఘనవిజయాలను హస్తగతం చేసుకోగల దిట్టలు.
అటువంటప్పడు ఈసారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఎలా వుంటుంది? మూడు కారణాలు చెప్పవచ్చు. అక్కడి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలిగే బౌలర్లు భారతజట్టులో వున్నారు. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ధాటిని కివీస్ తట్టుకోవడం కష్టమే. మిగిలిన బౌలర్లు కూడా ఈ ఇద్దరికీ మంచి మద్దతు ఇవ్వగలిగేవారే. వరో కారణం ఏమిటంటే మన జట్టు తొలుత వన్డే సిరీస్ ఆడుతుంది. సాధారణంగా ఈ పోటీలకోసం తయారుచేసే పిచ్ లు మ్యాచ్ లను అనూహ్యమైన మలుపులు తిప్పేవిగా ఉండవు. అందువల్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యేలోగా జట్టులోని కీలకమైన ఆటగాళ్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ లో స్థిరపడడానికి అవకాశం మెండుగా లభిస్తుంది. యువరాజ్ సింగ్, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్ వీలైనంత త్వరగా పరిస్థితులకు అలవాటుపడడంపైనే ఆధారపడి వుంటుంది.
News Posted: 20 February, 2009
|