బోర్డు, ఐసిఎల్ రాజీ
న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ), బోర్డు నిషేధించిన ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసిఎల్) మధ్య రాజీ కుదిరింది. రెండు సంస్థలు అతి త్వరలో ఒప్పదంమీద సంతకాలు చేయనున్నాయి.ప్రపంచ ఆర్ధిక మాంద్యం కారణఁగా బోర్డు నిర్వహించే ఇండియన్ ప్రీమిర్ లీగ్(ఐపిఎల్), ఐసిఎల్ లకు స్పాన్సర్లు లభించడం అసాధ్యమైపోవడం, మరోవైపు రాజీ పడాలని ఇరు పక్షాలమీద అంతర్జాతీయ క్రికెట్ రంగం ఒత్తిడిచేయడంతో ఈ ఒప్పందం తప్పనిసరి అయింది. మరికొద్ది రోజుల్లో జోహాన్స్ బర్గ్ లో జకుగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)సమావేశంలో బిసిసిఐ, ఐసిఎల్ ప్రతినిధులు లీగ్ పై నిషేధాన్ని ఎత్తివేయడానికి ఉద్దేశించే ఒప్పందంపై సంతకాలు చేయనున్నారని ఐసిసి ప్రతినిధులు తెలిపారు.ఐసిసి అధ్యక్షుడు డేవిడం మోర్గన్, క్రికెట్ ఆస్ట్రేలియా సిఇఒ జేమ్స్ సదర్లాండ్ సమావేశంలో పాల్గొంటారు.
ఒప్పదం కుదుర్చుకునే ఆశాభావంతో బిసిసిఐ, ఐసిఎల్ సమావేశం కావడం ఇది రెండోసారి. క్రితంసారి ఇరు పక్షాలు సమావేశమైనప్పుడు చర్చలు ముందుగా అనుకున్నట్టు జరగలేదు. ఈసారి సమావేశంలో సూచనలకు సంబంధించిన సమాచారం వెల్లడికాకపోయినా, క్రికెట్ బోర్డుకు ఐసిఎల్ భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజు చెల్లించి, ప్రస్తుత రూపంలోనే కొనసాగుతుంది.
News Posted: 21 February, 2009
|