వాళ్లు పోతే ఇంకొకరు
కోల్ కటా: షోయబ్ అఖ్తర్ బౌల్డ్... ఉమర్ గుల్ స్టంప్డ్... రికీ పాంటింగ్ రనౌట్! ఇలాంటి హేమాహేమీలు మొదట్లోనే నిష్క్ర్రమించినా కోల్ కటా నైట్ రైడర్స్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిబ్బరంగానే వున్నాడు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ స్పాన్సర్ గా పెప్సీ స్థానంలో మళ్లీ కోకా కోలా రావడాన్ని కూడా అతడు యధాలాపంగానే తీసుకున్నాడు. 'ఇలాంటివి జరుగుతాయని మాకు ముందే తెలుసు. అందుకే వాళ్ల స్థానంలో ఆడేవాళ్లకోసం అన్వేషించాలని టీం యాజమాన్యానికి అప్పుడే చెప్పాం' అని టెలిగ్రాఫ్ విలేఖరితో మాట్లాడుతూ సౌగవ్ చెప్పాడు. కిందటి సంవత్సరం కూడా కీలకమైన మ్యాచ్ లకు పాంటింగ్ డుమ్మాకొట్టాడని, అందువల్ల ఎంతో నష్టపోయామని, అందుకే ఈసారి ్న్ని పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లకోసం అన్వేషిస్తున్నామని సౌరవ్ వివరించాడు.
కోల్ కటా నైట్ రాడర్స్ నునిరంతరం అంటిపెట్టుకుని ఉండేది, కోకా కోలా ఉత్పత్తిచేసే స్వచ్ఛమైన లెమన్ డ్రింక్ స్ప్రైట్. కోకా కోలా ఈ యేడాది మళ్లీ షారుఖ్ జట్టు నైట్ రైడర్స్ ను స్పాన్సర్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని మొట్టమొదటి అధికారపూర్వక చీర్ లీడర్స్ బృందం అన్వేషణలో ప్రస్తుతం బిజీగా వున్నాడు సౌరవ్. షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ నిర్మించే రియాల్టీ టివి షో నైట్స్ అండ్ ఏంజిల్స్ కోసం చీర్ లీడర్స్ ను ఎంపికచేస్తున్నారు. గతంలో టీమ్ ఇండియా కెప్టెన్ గా క్రికెట్ జట్లను ఎంపికచేసే వాడినని, ఇప్పుడు చీర్ లీడర్స్ వేటలో పడ్డానని, నైట్ రైడర్స్ జట్టులో యువకులు ఎక్కువమంది ఉన్నందున వాళ్లను ఉత్సాహపరచడానికి చీర్ లీడర్స్ అవసరమని సౌరవ్ చెప్పాడు. వచ్చే వారం చివరిలో నైట్స్ అండ్ ఏంజిల్స్ టివి ప్రీమియర్ తో సౌరవ్ టివి అరంగేట్రం చేస్తున్నాడు. ఒక బెంగాలీ చానెల్ లో క్విజ్ షో హోస్ట్ గా కూడా సౌరవ్ బుల్లితెరమీద కనిపించనున్నాడు.
News Posted: 21 February, 2009
|