శ్రీలంక స్టేడియంకు చేయూత
కొలంబో: దక్షిణ శ్రీలంకలోని హంబన్ తోట జిల్లాలో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారతదేశం నిధులు సమకూరుస్తుంది. ఈ గ్రౌండ్ లో 2011 వరల్డ్ కప్ పోటీలు కనీసం రెండయినా నిర్వహించాలని అధికారులు ఆశిస్తున్నారు. హంబన్ తోట ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను అంతర్జాతీయ క్రికెటం కౌన్సిల్ స్టేడియాల జాబితాలో, ప్రత్యామ్నాయ పోటీ వేదికగా చేరుస్తామని, ఆ తరువాత 2011 పిబ్రవరి లో శ్రీలంకలో జరిగే వరల్డ్ కప్ పోటీలకు ప్రధాన స్టేడియంగా ప్రకటిస్తామని శ్రీలంక క్రికెట్ అధికారి ఎస్.లియనగమ చెప్పారు.
కొత్త స్టేడియం నిర్మాణం పనులు మార్చి నెలాఖరులో ప్రారంభించాలనుకుంటున్నామని, దీనికయ్యే ఖర్చులో అధిక శాతం భారతదేశం సమకూరుస్తుందని లియనగమ చెప్పారు.
News Posted: 22 February, 2009
|