కివీస్ క్రికెట్ కు డబ్బే డబ్బు
వెల్లింగ్టన్: భారత క్రికెట్ జట్టు పర్యటన ద్వారా న్యూజిలాండ్ క్రికెటం సంఘానికి భారీగా ఆదాయం లభిచనుంది.కివీస్ క్రికెటం చరిత్రలోనే ఇగి చాలా పెద్ద మొత్తమని అంటున్నారు. ఒక్క టెలివిజన్ హక్కులు కేటాయించి నందుకే 25 మిలియన్ డాలర్లు ్దనంగా లభిస్తాయట. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ లను ప్రసారం చేస్తున్నందుకు 22 రోజుల్లో, రోజుకు మిలియన్ డాలర్లు ఆదాయం పొందనున్నారని డొమినియన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది.
న్యూజిలాండ్ కు ఇంతవరకూ రగ్బీ ఆట ద్వారానే ఎక్కువ ఆదాయం లభించేది. టివి లైసెన్స్ హక్కులు ఇచ్చినందుకు సంవత్సరానికి 18 మిలియన్ డాలర్లు వస్తుండగా, ప్రస్తుత ఆదాయం ఈ మొత్తాన్ని మించిపోయింది. భారత జట్టు ప్రపంచంలో ఇప్పుడు సూపర్ స్టార్ హోదాలో ఉన్నందు వల్ల సహజంగానే న్యూజిలాండ్ క్రికెట్ కు ఆదాయం బాగానే వస్తోంది. కేవలం నెల రోజుల ప్రసారాలకే ీ సొమ్ము లభించడం విశేషం. అంతే కాదు. ఈ పర్యటనకు గల ప్రాధాన్యత దృష్ట్యా అన్నింటినీ ఇన్సూర్ చేస్తున్నారు. టివి హక్కులతే పాటు టిక్కెట్లను కూడా ఇన్సూర్ చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా న్యూజిలాండ్ క్రికెట్ ఆదాయం 30 మిలియన్ డాలర్లు కాగా, ఈ సంవత్సరం 40 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాన్ చెప్పారు. గతంలో కంటె ఈసారి భారత జట్టు పర్యటన కారణంగా ఆదాయం బాగా పెరుగుతుందని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా జట్ల పర్యటనల కంటె కూడా చాలా ఎక్కువని అన్నారు. ప్రపంచ రప్ లో ఆడితే తమకు వచ్చే ఆదాయం 20 మిలియన్ డాలర్లయితే, ఇప్పుడు టీమ్ ఇండియా పర్యటన వల్ల వచ్చేది అంతకంటె ఎక్కువని తెలిపారు. భవి, భవిష్యత్తులో భారత జట్టు రెగ్యులర్ గా ఇక్కడకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
News Posted: 23 February, 2009
|