బై చెప్పనున్న బక్నర్
కింగ్ స్టన్: రికార్డు స్థాయిలో 126 టెస్ట్ మ్యాచ్ లలో అంపైర్ గా నిలుచున్న వెస్టిండియన్ వెటరన్ స్టీవ్ బక్నర్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య కేప్ టౌన్ లో జరిగే నూడో టెస్ట్ తనకు చివరి అంతర్జాతీయ పోటీ అవుతుందని చెప్పాడు. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్ తన కెరీర్ లో చివరి టెస్ట్ సిరీస్ అని ఇటర్నేషనల్ క్రికెట్ కమిటీ(ఐసిసి)కి తెలియజేశానని జమైకాలోని మాంటెగో బే నివాసి అయిన అరవై రెండేళ్ల బక్నర్ మీడియీకు చెప్పాడు. అంపైర్ గా కొనసాగడానికి శారీరకంగా ఫిట్ నెస్ సమస్య ఏదీ లేదని, కాని రిటైరవడానికి ఇదే సరైన సమయమని చెబుతూ, 'మరో రెండు మూడేళ్లు మైదానంలో ఏ ఇబ్బంది లేకుండా నిల్చోగలనని నాకు తెలుసు. కాని రిటైరవాల్సిన సమయం వచ్చేసిందని అంతరాత్మ చెబుతోంది' అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా 100 టెస్ట్ లు పూర్తి చేసిన బక్నర్ కరేబియన్ దీవుల్లో అంపైరింగ్ టాలెంట్ ను వెలికితీసేందుకు వెస్టిండీసే క్రికెట్ బోర్డుతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ఆయన వెల్లడించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నమెంట్ లలో అంపైర్ గా పాల్గొన్న స్టీవ్ బక్నర్, 179 వన్డే ఇంటర్నేషనల్స్ లో కూడా అంపైరింగ్ చేశాడు.
News Posted: 23 February, 2009
|