బోర్డు,లీగ్ చర్చలు విఫలం
జోహాన్స్ బర్గ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ), తిరుగుబాటు ట్వంటీ20 లీగ్ ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసిఎల్)ల మధ్య రాజీ కుదర్చడంలో అతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిఎల్) విఫలమయింది. తమ కార్యకలాపాలను అనధికార క్రికెట్ గా పరిగణించాలని ఐసిఎల్ చేసుకున్న దరఖాస్తు, దుబాయిలో ఏప్రిల్ లో జరుగనున్న ఐసిసి బోర్డు సమావేశం పరిశీలనకు వెళ్తుంది. సోమవారం ఇక్కడ మూడు గంటలసేపు జరిగిన చర్చలు విపలం కావడం పట్ల ఐసిసి అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ నిరాశ వ్యక్తం చేశారు. వివాదాన్ని పరిష్కరించుకోవాలనే సదుద్దేశంతో చర్చలకు వచ్చిన ఇరు పక్షాలను ఆయన అభినందిస్తూ, చర్చలు స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితాన్ని సాధించ లేకపోయామని ఐసిసి విడుదల చేసిన ఒక ప్రకటనలో మోర్గాన్ తెలిపారు.
దక్షిణాఫ్రికాలో 2007లో జరిగిన మొట్టమొదటి ట్వంటీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భారత జట్టు విజయం సాధించాక, భారతదేశంలోని ఏతిపెద్ద మీడియా సంస్థ ఆర్ధిక సాయంతో ఐసిఎల్ ఏర్పడింది. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ విదేశీ క్రికెటర్లను కాంట్రాక్టుకు తీసుకున్నాక, బిసిసిఐ ఐసిఎల్ కు గుర్తింపును తిరస్కరించింది. ఐసిఎల్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్న క్రికెటర్లను వారి మాతృసంస్థలు బహిష్కరించేలా వారిని ఒప్పించింది.
News Posted: 24 February, 2009
|