యూనిస్ ఖాన్ ట్రిపుల్ సెంచరీ
కరాచి: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్ట్ లో పాకిస్తాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ ట్రిపుల్ సంచరీ చేసి జట్టును ఫాలో ఆన్ నుంచి తప్పించాడు. మంగళవారం ఆట నాలుగో రోజు టీ విరామ సమయానికి 243 పరుగులు చేసిన యూనిస్ కు ిది టెస్ట్ కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ. అప్పటికి జట్టు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 453 పరుగులు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 644 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శ్రీలంక కెప్టన్ మహేల జయవర్దనె 240 పరుగులు చేశాడు. 132 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచం లో ప్రత్యర్ధి కెప్టెన్లు డబుల్ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. నాలుగో రోజు ఆయ ముగిసే సమయానికి యూనిస్ 306, ఫైసల్ ఇక్బాల్ 27 పరుగులతో నాటౌట్ గా వున్నారు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 574 పరుగులు సాధించింది. యూనిస్ ఖాన్ కు ఇది 59వ టెస్ట్ మ్యాచ్ కాగా, వ్యక్తిగత స్కోరు 184 వద్ద టెస్ట్ క్రికెట్ లో 5,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో అతడు ఆరో పాకిస్తానీ బ్యాట్స్ మన్ కాగా, జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్, మహమ్మద్ యూసఫ్, సలీం మాలిక్, జహీర్ అబ్బాస్ ఈ జాబితాలో అతడికి ముందున్నారు. యూనిస్ ఖాన్ 528 నిముషాల్లో 385 బంతులు ఎదుర్కొని డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. రెండు జట్లు భారీ స్కోర్లు చేయడంతో ఈ టెస్ట్ డ్రా దిశగా పయనిస్తోంది. రెండో టెస్ట్ లాహోర్ లో ఆదివారం ప్రారంభమవుతుంది.
News Posted: 24 February, 2009
|