ఏప్రిల్ 10నుంచి ఐపిఎల్
ముంబాయి: ఇండియన్ ప్రీమియం లీగ్(ఐపిఎల్) క్రికెట్ రెండో సీజన్ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జైపూర్ లో జరుగుతుంది. మే 21, 22 తేదీల్లో రెండు సోమీ ఫైనల్ పోటీలు చెన్నైలో, మే 24న ఫైనల్ మ్యాచ్ ముంబాయిలో జరుగుతాయి. అయితే ఫైనల్ మ్యాచ్ నిర్వహించే స్టేడియం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని. త్పరలోనే నిర్ణయం తీసుకుంటామని ఐపిఎల్ అధికారి ఒకరు చెప్పారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సిసిఐ) స్టేడియం, నెరూల్ లోని డివై పటేల్ స్టేడియం పరిశీలనలో ఉన్నాయి. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ పోటీలను నిర్వహించేందుకు తొమ్మిది స్టేడియంలను సిద్ధం చేశారు. విశాఖపట్నంలోని విడిసిఎ,ఎసిఎ క్రికెట్ స్టేడియం ఈ యేడాది కొత్త వేదికగా ఎంపికయింది. హైదరాబాద్ జట్టు డక్కన్ ఛార్జర్స్ జట్టు ఆడే రెండు మ్యాచ్ లు అక్కడ జరుగుతాయి. ఇదిలా ఉండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ మ్యాచ్ లు అన్నీ జైపూర్ లోనే ఆడాలని నిర్ణయించింది. కొన్ని పోటీలు అహ్మదాబాద్ కు మారవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా వారాంతం రోజుల్లో రెండు మ్యాచ్ లు, మిగిలిన రోజుల్లో ఒక్కొక్క మ్యాచ్ నిర్వహించనున్నారు.
డే మ్యాచ్ లు ఉదయం 8 గంటలకు, డే అఁడ్ నైట్ మ్యాచ్ లు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతాయి.
News Posted: 25 February, 2009
|