కరాచి టెస్ట్ డ్రా
కరాచి: పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్ భారీ స్కోర్లతో డ్రాగా ముగిసింది. బుధవారం చివరి రోజున ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు సాధించింది. ఒక దశలో 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లంక జట్టును కుమార సంగక్కర(65)ఆదుకున్నాడు. ఆ తరువాత తిలన్ సమరవీర, ప్రసన్న జయవర్దనె చివరి 8 ఓవర్లు అజేయంగా ముగించారు. అంతకుముందు పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ ను 6 వికెట్ల నష్టానికి 765 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మంగళవారం ట్రిపుల్ సెంచరీ (306) పూర్తి చేసిన కెప్టెన్ యూనిస్ ఖాన్ చివరి రోజు మరో 7 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సెంచరీ(158)చేయడం విశేషం. రెండో టెస్ట్ లాహోర్ లో మార్చి 1న ప్రారంభమవుతుంది.
News Posted: 25 February, 2009
|