వన్డేకు ఇషాంత్ అన్ ఫిట్?
వెల్లింగ్టన్: శుక్రవారం న్యూజిలాండ్ తో ఆడిన రెండో ట్వంటీ మ్యాచ్ లో గాయపడిన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ మార్చి 3న నేపియర్ లో జరగనున్న మొదటి వన్డే ఇంటర్నేషల్ మ్యాచ్ లో ఆడకపోవచ్చు. ఫీల్డంగ్ చేస్తూ బంతిమీద పడిపోవడంతో అతడి భుజానికి గాయమయింది. శనివారం ఎం.ఆర్.ఐ స్కానింగ్ చేయించగా గాయమైన చోట చర్మం కమిలిపోయినట్టు కనిపించింది. ఇంకో రెండు రోజులు అతడి గాయాన్ని బాగా గమనిస్తామని, బహుశా ఇషాంత్ మొదటి వన్డేలో ఆడకపోవచ్చని అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ నిరంజన్ షా చెప్పారు.
ఇదిలా ఉండగా, భారత జట్టుకు మరింత పటిష్టంగా భద్రతా ఏర్పాట్లకు చర్యలు తీసుంటున్నారు. శుక్రవారం ట్వంటీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు భారతఫీల్డర్ పై ప్రేక్షకులు బాటిల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తరువాత భారత ఆటగాళ్లు, మ్యాచ్ రిఫరీ రంజన్ మడుగల్లె ఆందోళన వ్యక్తం చేశారని, ఇకపై మరింత కట్టుదిట్టంగా భద్రత కల్పిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జస్టిన్ వాఘన్ తెప్పారు.
News Posted: 28 February, 2009
|