మోడీపై దీక్షిత్ ఫిర్యాదు
జైపూర్: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్.సి.ఎ) అధ్యక్ష పదవికోసం లలిత్ మోడీ, సంజయ్ దీక్షిత్ మధ్య జరిగిన పోటీ మరో ఆసక్తి కరమైన మలుపు తిరిగింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఆర్.సి.ఎ అసాధారణ వార్షిక సర్వసభ్య సమావేశంలో మోడీ తనను బెదిరించారని ఐ.ఎ.ఎస్ అధికారి అయిన దీక్షిత్ జ్యోతినగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మోడీపై ఫిర్యాదు అందిందనీ, దర్యాప్తు జరుపుతున్నామనీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లఖన్ సింగ్ తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించాలని మోడీని ఆహ్వానించగా, దీక్షిత్, ఆయన మద్దతుదారులు అందుకు అభ్యంతరం చెప్పడంతో నాటకీయ పరిణామాలు ప్రారంభమయ్యాయి. ఆర్.సి.ఎ ఇన్ ఛార్జిగా జస్టిస్ కాస్లీవాల్ ను సుప్రీం కోర్టు నియమించినందు వల్ల ఆయనే సమావేశానికి అధ్యక్షత వహించాలని దీక్షిత్ డిమాండ్ చేశారు. ఆ తరువాత దీక్షిత్ వర్గం ఎన్నికలో పాల్గొనేందుకు వెళ్లగా, మోడీ వర్గం సమావేశాన్ని కొనసాగించింది.
News Posted: 1 March, 2009
|