న్యూజిలాండ్ కు ద్రావిడ్
ముంబాయి: న్యూజిలాండ్ లో మార్చి 18 నుండి ప్రారంభమయ్యే మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఆడేందుకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ సోమవారం ఉదయం ఇక్కడినుండి బయలుదేరి వెళ్లారు. వారితోబాటు అమిత్ మిశ్రా, లక్ష్మీపతి బాలాజీ, ధావల్ కులకర్ణి, ఎం విజయ్ కూడా వెళ్లారు. వారు మందళవారం ఉదయం ఆక్లండ్ చేరుకుంటారు. న్యూజిలాండ్ వాతావరణానికి అలవాడు పడేందుకు సిరీస్ ప్రారంభానికి చాలా రోజుల ముందే రాహుల్, లక్ష్మణ్ అక్కడకు వెళ్తున్నారు. సిరీస్ ప్రారంభమయ్యేలోగా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లలో ఆడేందుకు అక్కడ ఏర్పాట్లు జరిగాయి.
News Posted: 2 March, 2009
|