ఇక వన్డే సిరీస్
నేపియర్: ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ లో గర్వభంగం పొందిన ధోనీ సేన, మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ లో కివీస్ మీద ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమవుతోంది. ఇషాంత్ శర్మ గాయం కారణంగా మొదటి మ్యాచ్ కు దూరం కావడం భారత బౌలింగ్ బలాన్ని కొంత దెబ్బతీసినా, ఇక్కడి మెక్ లీన్ పార్క్ లో న్యూజిలాండ్ దూకుడుకు కళ్లెం వేసితీరాలి. ఒక వేళ ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే, కివీస్ రెచ్చిపోవడం ఖాయం. ఆల్ రౌండర్లు సమృద్ధిగా వున్న ఆ జట్టును ఆ తరువాత అదుపుచేయడం వాళ్లకి ఎంతమాత్రం సాధ్యం కాదని చెప్పవచ్చు. ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టగల ఆల్ రౌండర్ కొరత టీమ్ ఇండియాను వేధిస్తోంది. రవీంద్ర జడేజా ఆ స్థానాన్ని భర్తీ చేయగల అవకాశాలు ఉన్నప్పటికీ, ట్వంటీ మ్యాచ్ లు అయిపోగానే అతడు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు.
News Posted: 2 March, 2009
|