నీడ లేని మోడి
ముంబాయి: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్.సి.ఎ)ఎన్నికలు ముగిసిన కొద్ది గంటలకే లలిత్ మోడి మకావ్ లో ఒక వివాహానికకి హాజరయ్యేందుకు జైపూర్ నుంచి వెళ్లారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)చైర్మన్ విధులు నిర్వర్తించడానికి త్వరలోనే ముంబాయి తిరిగి వస్తారు. మీడీయా హడావిడికి దూరంగా సుదీర్ఘమైన హాంగ్ కాంగ్ ప్రయాణంలో కొంచె సేద దీరి, ఆదివారం నాటి ఘోర పరాజయ ప్రభావాన్ని అంచనా వేసుకుంటారు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా తన ఎదుగుదలపై ఈ ఓటమి ప్రభావం వెంటనే కాకపోయినా భవిష్యత్తులో తప్పక ఉంటుందని ఆయన గ్రహిస్తారు. కాకపోతే భారత క్రికెట్ లో క్షణం ఊపిరి పీల్చుకునే తీరికలేని ఈ పెద్ద మనిషికి ప్రస్తుతానికి నిలువ నీడ లేకుండా పోయింది.
ఐపిఎల్ కమిషనర్ అనిపించుకున్న లలిత్ మోడి ఇప్పుడు సొంత రాష్ట్రమంటూ లేకపోవడంతో, ఇకపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ0 సమావేశాలకు ఉపాధ్యక్షుడి హోదాలో హాజరు కాగలరు కాని ఓటు వేసే హక్కు మాత్రం కోల్పోయారు. ఆయన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కూడా. గత సంవత్సరం సెప్టెంబర్ లో సెంట్రల్ జోన్ నుంచి ఆయన బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగే వీలున్నా, రెండేళ్ల తరువాత మళ్లీ ెన్నికలో పాల్గొన వలసి ఉంది. అంటే 2010 వరకు ఉపాధ్యక్ష పదవికి ఢోకా లేదు కాని ఆయన ప్రత్యర్ధులు అంతవరకూ ఆగుతారా అన్నదే ప్రశ్న. అయితే ఐపిఎల్ లో ఆయన పెత్తనానికి మాత్రం ఎటువంటి అవరోధం ఉండదు. ఆదివారం నాటి ఓటమి ప్రభావం అసలుండదు. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ జట్టు మీద మాత్రం ఓటమి నీడలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక ముందంతా సంజయ్ దీక్షిత్ హయాంలో ఆర్.సి.ఎ నుండి ఆయనకు లభించే మద్దతు మీదనే ఆధారపడి వుంటుంది.
News Posted: 2 March, 2009
|