షాక్ తిన్నాం, అంతే!
లాహోర్: శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగినప్పటికీ పాకిస్తాన్ వచ్చినందుకు తాను ఏ మాత్రం విచారించడం లేదని మంగళవారం దాడిలో గాయపడిన కుమార్ సంగక్కర అన్నాడు. కొందరు ఆటగాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని అతడు చెప్పాడు. 'అందరూ క్షేమంగా ఉన్నారు. కొంత మంది గాయపడ్డారు. అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. షాక్ నుంచి ఇంకా తేరుకోలేదంతే! తిలన్ సమరవీర కాలిరి బుల్లెట్ గాయమయింది. పి.తరంగ ఛాతీలో ఇనపముక్క గుచ్చకుని ఆసుపత్రిలో ఉన్నాడు. అదృష్టవశాత్తు గాయం లోతుగా లేదు. నా భుజంలో కూడా రవ్వలు గుచ్చుకున్నాయి. వాటన్నింటినీ తొలగించేశారు. అజంతా మెండిస్ తల వోనుక, వెన్నులోను కొన్ని గుచ్చున్నాయి. వాటిని కూడా తీసేశారు. గాయపడిన అందరూ ఇప్పుడు క్షేమంగా ున్నాం' అని దాడి జరిగిన కొద్ది గంటల తరువాత సంగక్కర చెప్పాడు.
ఏది ఏమైనా, టెర్రరిస్టులు దాడికి తమను లక్ష్యంగా చేసుకున్నా పాకిస్తాన్ వచ్చినందుకు బాధపడడం లేదని సంగక్కర అన్నాడు. ఇళ్లకు వెళ్లి కుటుంబాలను కలుసుకోవాలని అందరూ అనుకుంటున్నట్టు అతడు చెప్పాడు. ఆల్ రౌండర్ సనత్ జయసూర్య కూడా ఇదే విషయం చెప్పాడు. తాను గాయపడిన కొందరు క్రికెటర్లతో మాట్లాడానని, ఎవరూ సీరియస్ గా గాయపడలేదని చెప్పారని పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అన్నాడు. అఁదరూ షాక్ లో ున్నారని, ఇళ్లకు వెళ్లిపోదామనుకుంటున్నారని చెప్పాడు. కుమార్ సంగక్కర భార్యతో కూడా మాట్లాడానని, అందరూ క్షేమమేనని, ఆందోళన చెందనవసరం లేదని చెప్పానని జయసూర్య వివరించాడు.
News Posted: 3 March, 2009
|