ఐపిఎల్ కు భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐప్ఎల్) పోటీలకు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి చెప్పారు. శ్రీలంక జట్టుపై లాహోర్ లో జరిగిన దాడి ప్రభావం ఐపిఎల్ పోటీలపై ఉండదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏప్రిల్ లో ప్రారంభం కానున్న ఐపిఎల్ రెండో సీజన్ లో పాల్గొనే క్రికెటర్లందరికీ భద్రత కట్టుదిట్టం చేస్తామని, భారతదేశం సురక్షితమైనదని మోడి హామీ ఇచ్చారు. గతంలో తాము కూడా దాడులకు గురయ్యామని, అటువంటి దారుణాలు భవిష్యత్తులో జరగకుండా విస్తృతమైన చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఐపిఎల్ పోటీలను వాయిదా వేసుకోవాలని భారత హోం మంత్రి పి.చిదంబరం సలహా ఇచ్చారు. ఎన్నికల విధులకు రక్షణ, భద్రతా దళాల సేవలు అతి ముఖ్యమైనవని, అందువల్ల ఐపిఎల్ టోర్నీని వాయిదా వేయడం శ్రేయస్కరమని హోం మంత్రి సూచించారు.
News Posted: 3 March, 2009
|