'రాయల్స్'కు శిల్ప చీర్స్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) జట్టు రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రచారాన్ని ప్రముఖ బాలివుడ్ నటి, టీమ్ కో-ఓనర్ శిల్పా షెట్టి శనివారం ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీని విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ జైపూర్ లో జరగవలసిన మ్యాచ్ లను ముంబాయికి మార్చినందుకు విచారం వ్యక్తం చేసింది. 'లీగ్ పోటీలను రాజస్థాన్ నుంచి ముంబాయికి మార్చడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నేను ఆశావాదిగానే మాట్లాడుతున్నాను. టెర్రరిజానికి భయపడి వెన్నుచూపే బదులు, దాన్ని అందరూ ధైర్యంగా ఎదిరించాలి. క్రీడారంగం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. ఐపిఎల్ కు ఈ క్షణంలో కావలసిందల్లా కట్టుదిట్టమైన భద్రత' అని శిల్ప చెప్పింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐపిఎల్ మ్యాచ్ ల సక్రమ నిర్వహణకు అప్రమత్తమైన భద్రతా ఏర్పాట్లు అవసరమని ఆమె గత బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడింది.
News Posted: 7 March, 2009
|