పరిశీలనలో ధర్మశాల
న్యూఢిల్లీ: ఐపిఎల్ రెండో సీజన్ లో పోటీలలో కొన్నింటిని నిర్వహించేందుకు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియం కూడా పరిశీలనలో ఉందని ఐపిఎల్ కమిషనర్, చైర్మన్ లలిత్ మోడి ఒక న్యూస్ చానెల్ కు చెప్పారు. వచ్చే 30 రోజుల్లో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ హామీ ఇచ్చింది. శుక్రవారం ముంబాయిలో సమావేశమైన టోర్నమెంట్ నిర్వాహకులు పోటీల నిర్వహణకు, గత సంవత్సరం పోటీలు నిర్వహించిన 9 నగరాలు కాక, 15 నగరాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. నాగపూర్ నగరం ఖరారు కాగా, ఈ జాబితాలో ధర్మశాల చేరే అవకాశం ఉంది. అహ్మదాబాద్, ఇండోర్, రాజ్ కోట్, బరోడా, కటక్ నగరాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.
News Posted: 7 March, 2009
|