సచిన్ కు రెస్ట్!
వెల్లింగ్టన్: క్రైస్ట్ చర్చ వన్డేలో 1639(నాటౌట్)పరుగులు చేసి భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించడానికి 'భారీ'గా దోహదపడిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ హామిల్టన్ లో బుధవారం జరుగనున్న నాలుగో మ్యాచ్ లో ఆడడం అనుమానమే! మూడో మ్యాచ్ లో అతడు మధ్యలో రిటైర్ అవడానికి కారణమైన పొత్తి కడుపులో నొప్పే ఇక్కడి స్నెడన్ పార్కులో జరగబోయే మ్యాచ్ లో అతడు ఆడకపోవడానికి కారణం కావచ్చు. సోమవారం వైద్య పరీక్షల తరువాత అతడి ఫిట్ నెస్ విషయం వెల్లడి కానున్నా, ఇక్కడి మ్యాచ్ కి సచిన్ రెస్ట్ తీసుకోవచ్చని భావిస్తున్నట్టు 'వైకాటో టామ్స్' పేర్కొంది. వన్డే సిరీస్ తరువాత జరగబోయే మూడు టెస్ట్ ల సిరీస్ లో మొదటిది ఇక్కడే మార్చి 18 నుంచి 22 వరకు జరుగుతుంది. టెండుల్కర్ కు బహుశా ఇదే ఆఖరి న్యూజిలాండ్ పర్యటన కావచ్చు.
ఆదివారం మ్యాచ్ లో 15 బౌండరీలు, 5 సిక్సర్లతో కివీస్ బౌలింగ్ ను పటాపంచలు చేసిన సచిన్ వన్డే రికార్డు స్కోరు(సయీద్ అన్వర్-పాకిస్తాన్)ను దాటడానికి ఇంకా 32 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. 'యాభయ్యో ఓవర్ పూర్తయ్యే వరకూ క్రీజులో నిలబడ గలిగితే 200 పరుగులు సాధించగలననే ఆశించాను. అదేమంత కష్టసాద్యం కాదు' అని అతడన్నాడు. అంతకుముందు మ్యాచ్ లో ఇయాన్ ఓబ్రియన్ వెసిన బంతి పొత్తి కడుపుమీద తగిలిందని, ఆ బాధ పూర్తిగా తగ్గలేదనీ, నిన్నటి మ్ాచ్ లో పెద్ద షాట్ కొట్టినప్పుడల్లా అది నొప్పి పెడుతూనే ఉందనీ, ఇక నిలబడడం సాధ్యం కాదనిపించడంతో పెవిలియన్ కు తిరిగి వెళ్లిపోయాననీ సచిన్ వివరించాడు.
News Posted: 9 March, 2009
|