'ట్వంటీ 'డబుల్' సాధ్యమే'
క్రైస్ట్ చర్చ్: వన్డే ఇంటర్నేషనల్ పోటీల్లో డబుల్ సెంచరీ చేయగల బ్యాట్స్ మెన్ ముగ్గురు మాత్రమే ఉన్నారని న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. 'సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ మాత్రమే వన్డే డబుల్ సెంచరీ సాధించగల సత్తా ఉన్నవాళ్లు' అని మెకల్లమ్ చెప్పాడు. ఎటువంటి బౌలింగునైనా ఖాతరు చేయకుండా చెలరేగిపోయి షాట్లు కొట్టే వ్యాట్స్ మెన్ ప్రపంచంలో చాలామంది ఉన్నారని, త్వరలోనే ఎవరో ఒకరు డబుల్ సెంచరీ చేయడం మనం చూస్తామని గత సంవత్సరం ఐపిఎల్ సీజన్ లో కోల్ కటా నైట్ రైడర్స్ తరఫున ఒక ఇన్నింగ్స్ లో 158(నాటౌట్) పరుగులు చేసిన మెకల్లమ్ అన్నాడు. 'మొదట ఒక బ్యాట్స్ మన్ డబుల్ సెంచరీ చేస్తే ఆ తరువాత అనేక మంది అదే దారి పడతారు. డబుల్ సెంచరీ చేయడం కష్ట సాధ్యమని అనుకుంటారు కాబట్టే అది అందని ద్రాక్షలా కనిపిస్తోందన్నాడు.
దాదాపు ్న్ని చోట్ల పిచ్ లు మారిపోతున్నాయని, బౌండరీలు చిన్నవి అయిపోతున్నాయని, వీటికి తోడుగా పవర్ ప్లే వచ్చి చేరిందని, సచిన్ టెండుల్కర్ మొన్న ఆదివారం డబుల్ సెంచరీ చేసే మంచి అవకాశం చేజారిపోయిందని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు. ట్వంటీ20 క్రికెట్ ఆటగాళ్ల ఆలోచనా ధోరణిని మార్చేసిందన్నాడు. చివరకు పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించే సందర్భాల్లో కూడా ఈ ఆటలో డబుల్ సెంచరీ చేయడం సాధ్యమేనని మెకల్లమ్ అభిప్రాయపడ్డాడు.
News Posted: 10 March, 2009
|