ఐపిఎల్ కు 10 వేల కోట్లు!
ముంబాయి: ఇంటియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ ద్వారా వచ్చే ఆదాయం గత సంవత్సరం కంటె 1,725 కోట్ల రూపాయలు ఎక్కువ అని నిర్వాహక కమిటీ చైర్మన్ లలిత్ మోడి చెప్పారు. ఈ యేడాది ఆదాయం 10,790 కోట్ల రూపాయలని, అధికారిక భాగస్వామ్య స్థానాలు రెండు ఇంకా ఖాళీగా ఉన్నాయని మంగళవారం విలేఖరుల సమావేశంలో మోడి వెల్లడించారు. రెండు ఖాళీల్లో ఒకదాని భర్తీ కోసం చర్చలు ముగింపు దశకు వచ్చాయని అతి త్వరలో కొత్త భాగస్వామి వచ్చి చేరుతారని వివరించారు. ఐపిఎల్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారానికి మల్టీప్లెక్స్ ల నుండి టెండర్లు ఆహ్వానించామని, ఒక ముఖ్యమైన షరతు కూడా విధించామని మోడి వెల్లడించారు. 'పోటీ ముంబాయిలో జరుగుతున్నప్పుడు ఇక్కడి మల్టీప్లంక్స్ లు వాటిని ఆ రోజు ప్రత్యక్షంగా ప్రసారం చేయకూడదు. మరో చోట జరిగే పోటీని ప్రత్యక్ష ప్రసారం చేసుకోవచ్చు' అని ఆయన వివరించారు.
ఈ యేడాది ఏప్రిల్ 10న ప్రారంభ పోటీ, మే 24న ఫైనల్ మ్యాచ్ నవీ ముంబాయి లోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని లలుత్ మోడి తెలిపారు. ఆటగాళ్లకు కల్పించే భద్రతా ఏర్పాట్ల గురించి ఆయన వివరిస్తూ 'విదేశీ ఆటగాడు మన దేశంలో ్డుగు పెట్టిన నిముషం నుంచి తిరిగి స్వదేశానికి బయలుదేరే నిముషం వరకు, అలాగే భారతీయ క్రికెటర్లకు పోటీ జరిగే నగరంలో హోటల్ లో వారు అడుగు పెట్టిన క్షణం నుంచి తిరిగి వెళ్లే వరకు, వారి భద్రత పూచీ మాదే. ఈ పద్ధతి గత సంవత్సరం ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ సిరీస్ లో అమలులో ఉంది. భారత ప్రభుత్వం, వేల్స్ క్రికెట్ బోర్డు ఉమ్మడిగా అందుకు వ్యూహం రూపొందించి పాటించాయి' అని చెప్పారు. అందుకే ీ సంవత్సరం సెక్యూరిటీ బడ్జెట్ గత సంవత్సరం కంటె పది రెట్లు అధికంగా ఉండవచ్చని అంచనా వేశామన్నారు.
News Posted: 10 March, 2009
|