భారత్ కు భంగపాటు!
ఆక్లండ్: వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ భారత జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. శనివారం ఇక్కడ జరిగిన ఐదో వన్డే పోటీలో 8 వికెట్ల తేడాతో ఒడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 36.3 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌట్ అయింది. వీరేంద్ర సెహ్వాగ్(40), రోహిత్ శర్మ(43 నాటౌట్) తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరూ సరిగ్గా ఆడలేకపోయారు. కివీస్ బౌలర్లలో జెస్సీ రైడర్ 3, జారబ్ ఓరమ్ 2, ఓ బ్రియాన్ 2, కైల్ మిల్స్ 1 వికెట్లు పడగొట్టారు. తరువాత బ్యాటింగుకు దిగిన న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో లక్ష్యం సాధించింది. ఓపెనర్ గా దిగిన జెస్సీ రైడర్(63), వన్ డౌన్ గుప్టిల్(57 నాటౌట్) అర్ధ సెంచరీలతో జట్టును గట్టెక్కించారు. రెండో ఓపెనర్ మెకల్లమ్ 2 పరుగులకు ప్రవీణ్ కుమార్ బౌలింగులో ఔటయ్యాడు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ రైడర్ వికెట్ ఇషాంత్ శర్మకు లభించింది. ఈ సిరీస్ ను భారత జట్టు 3-1తో కైవసం చేసుకుంది. రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ మార్చి 18న హామిల్టన్ లోని స్నెడన్ పార్క్ లో ప్రారంభమవుతుంది. గత 41 సంవత్సరాల్లో భారత జట్టు న్యూజిలాండ్ లో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలుపొంద లేదు.
News Posted: 14 March, 2009
|