విండీస్ కెప్టెన్ రామ్ దిన్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారతీయ సంతతికి చెందిన దినేశ్ రామ్ దిన్(23) వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అతడి పూర్వీకులు 1845-1917 మధ్య కాలంలో చక్కెర పరిశ్రమ, కోకో తోటల్లో పని చేయడం కోసం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతడి సార్థ్యంలో విండీస్ జట్టు ఇంగ్లండ్ తో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ లో తలపడుతుంది. ప్రస్తుత జట్టుకు వైస్ కెప్టెన్ ్యిన రామ్ దిన్ మంచి వికెట్ కీపర్ కూడా. ఇటీవల గాటపడిన కెప్టెన్ క్రిస్ గేల్ నుంచి అతడు బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. విండీస్ జట్టుకు సారథ్యం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి ట్రినిడాడియన్ రామ్ దిన్. భారతీయ సంతతికి చెందిన నాలుగో కెప్టెన్. ఇంతకుముందు రోహన్ కన్హాయ్, ఆల్విన్ కాళీచరణ్, శివనరైన్ చందర్ పాల్ విండీస్ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించారు. రామ్ దిన్ గతంలో వెస్టిండీస్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు.
News Posted: 14 March, 2009
|