టెస్ట్ సిరీస్ మనదే:పటౌడీ
భోపాల్: బారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుత జట్టు ఉత్తమమైనదని మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అన్నాడు. న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ కూడా కైవసం చేసుకోగలదని 'టైగర్' పటౌడీ చెప్పాడు. భార్య ప్రముఖ నటి షర్మిలా టాగూర్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి ప్రైవేటు ఫంక్షన్ లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన పటౌడీ ఇక్కడ విలేఖరులతో మాట్లాడాడు. జట్టు సభ్యులు వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా దేశ గౌరవం కోసం ఆడితే, ధోనీ సేనను ఓడించడం ఎవరి తరం కాదన్నాడు. అయితే ఈ జట్టు ఆడుతున్న తీరు చాలా బాగుందని, ఆడుతున్న కొద్దీ సామర్ధ్యానికి మరింత పదును పెట్టుకుంటోందని పటౌడీ వ్యాఖ్యానించాడు.
News Posted: 15 March, 2009
|